Skip to main content

Namaste NRI

డొనాల్డ్ ట్రంప్ పై మాజీ మోడల్ స్టాసీ విలియమ్స్ .. సంచలన ఆరోపణలు

అమెరికా అధ్యక్ష ఎన్నికలు పట్టుమని పదిరోజులు కూడా లేవు. ఈలోగా అధ్యక్ష రేసులో ఉన్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై మరో అభియోగం వచ్చింది. స్టాసీ విలియమ్స్ అనే అమెరికా మాజీ మోడల్ 1993లో ట్రంప్ తనను అసభ్యకరంగా తాకినట్టు వెల్లడించారు. ట్రంప్‌తో తనకున్న పరిచయం గురించి ఆమె వివరించారు . 1992లో ట్రంప్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ప్రముఖ ఫైనాన్షియర్ జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో డేటింగ్‌లో ఉన్న ఆమెను ఓ పార్టీలో ట్రంప్‌కు పరిచయం చేశారు. కొన్ని రోజుల తరువాత ఓ రోజు జెఫ్రీ నన్ను, న్యూయార్క్ లోని ట్రంప్ కార్యాలయానికి తీసుకెళ్లాడు. నన్ను చూసి జెఫ్రీ , ట్రంప్ నవ్వుకున్నారు. అప్పుడే ట్రంప్ నన్ను తన వైపునకు లాక్కొని ఎంతో అసభ్యంగా తాకారు అని కమలాహారిస్ ప్రచార బృందానికి ఈ విషయాన్ని ఆమె ఫోన్‌కాల్ ద్వారా తెలియజేసింది. జెఫ్రీ, ట్రంప్ మంచి స్నేహితులని, వారిద్దరూ ఎంతో సమయం గడిపేవారని స్టాసీ విలియమ్స్ తెలిపారు. అతడు 20 మందికి పైగా మహిళలను లైంగికంగా వేధించాడని ఆరోపించారు. దీనిపై ట్రంప్ ప్రచార బృందం ఇదంతా కట్టుకథగా కొట్టిపారేసింది.

Social Share Spread Message

Latest News