తెలంగాణతో పాటూ మిజోరం, ఛత్తీస్‌ఘడ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో ఎన్నికలు ముగిశాయి. ప్రజాతీర్పుపై ఉత్కంఠను మరింత పెంచుతూ ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. తెలంగాణ రాష్ట్రంలో ఈసారి కాంగ్రెస్ కు ఓటర్లు అధికారం కట్టబెట్టబోతున్నారా? నేషనల్ మీడియా, వివిధ సంస్థలు రిలీజ్ చేసిన ఎగ్జిట్ పోల్స్ చూస్తే అదే అనిపిస్తోంది. జచీచీ-న్యూస్ 18, చాణక్య స్ట్రాటజీస్, ఆరా, జన్ కీ బాత్, పీపుల్స్ పల్స్, రేస్, ఇండియా టీవీ-సీఎన్ఎక్స్, పోల్ స్ట్రాట్, స్మార్ట్ పోల్, రిపబ్లిక్ టీవీకి సంబంధించి ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అయ్యాయి. వీటిల్లో పోల్ స్ట్రాట్ తప్ప మిగతా అన్ని పోల్స్ కూడా కాంగ్రెస్ కు అధికారం దక్కుతుందని ప్రకటించాయి. పోల్ స్ట్రాట్ మాత్రం హంగ్ పరిస్థితి ఉంటుందని చెప్పింది.
తెలంగాణలో ఎన్నికల పర్వం ముగిసింది. ఓటర్లు వేసిన ఓట్లు జుపవీల్లో భద్రంగా ఉన్నాయి. ఇక డిసెంబర్ 3న ఫలితాలు రావడమే మిగిలి ఉంది. పోలింగ్ టైమ్ ముగిసే తర్వాత ఈసీ ఆదేశాలతో సాయంత్రం ఐదున్నర గంటల తర్వాత దేశంలోని ప్రముఖ మీడియా, సర్వే సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్ని బయటపెట్టాయి. తెలంగాణకు సంబంధించి దాదాపు 10 సంస్థలు ఇచ్చిన సర్వేల్లో తొమ్మిది సర్వేలుౌ కాంగ్రెస్ కు అధికారం దక్కే అవకాశం ఉందని ప్రకటించాయి. రిపబ్లిక్ టీవీ చాణక్య స్ట్రాటజీస్ ప్రకారం కాంగ్రెస్ కు 67 నుంచి 78 సీట్లు వచ్చే ఛాన్సుంది. బీఆర్ఎస్ కు 22 నుంచి 31 స్థానాలలోపు వస్తాయంటోంది. ఇక స్మార్ట్ పోల్ అయితే ఏకంగా 70 నుంచి 82 సీట్లతో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ప్రకటించింది. బీఆర్ఎస్ కు 24 నుంచి 36లోపే అంటోంది. పీపుల్స్ పల్స్ కూడా కాంగ్రెస్ 72 సీట్లు గెలుచుకుంటుందని చెబుతోంది. రిపబ్లిక్ టీవీ 58 నుంచి 68 సీట్లు కాంగ్రెస్ కు కట్టబెట్టింది. ఇంకా చాణక్య స్ట్రాటజీస్, ఆరా, జన్ కీ బాత్, రేస్, సీఎన్ఎన్, ఇండియా టీవీ లాంటి సర్వేలు కూడా కాంగ్రెస్ కు తెలంగాణలో అధికారం దక్కుతుందని ప్రకటించాయి.