విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం ఫ్యామిలీ స్టార్. పరశురాం డైరెక్ట్ చేస్తున్నాడు. మృణాళ్ ఠాకూర్ ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. ఇప్పటికే గ్లింప్స్, టీజర్ రిలీజ్ చేసి ఫ్యామిలీ స్టార్‌గా విజయ్ దేవరకొండ సందడి ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చేశాడు పరశురాం. తాజాగా మూవీ లవర్స్‌కు అదిరిపోయే అప్‌డేట్స్ అందించారు మేకర్స్. ఫ్యామిలీ స్టార్ థర్డ్ సాంగ్ మధురం కదాను మార్చి 25న లాంఛ్ చేస్తున్నట్టు ప్రకటిం చారు. అదేవిధంగా ఫ్యామిలీ స్టార్ ట్రైలర్‌ను మార్చి 28న విడుదల చేయనున్నారు.
ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. హోల్ సమ్ ఎంటర్‌టైనర్‌గా సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ పరశురామ్ పెట్ల రూపొందిస్తున్నారు. క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వాసు వర్మ వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 5వ తేదీన తెలుగు, తమిళ, హిందీ భాషల్లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది.