విదేశాల్లో భారతీయ సంస్కృతి, శాస్త్రీయ నృత్యాలతో ప్రవాస భారతీయురాలు లహరి తొలి అరంగేట్రం ప్రదర్శనతో ఆకట్టుకుంది. తెలుగునేలపై ప్రాణం పోసుకున్న కూచిపూడి నాట్యం ఖండాంతారాలు దాటి తన ఉనికిని చాటుకుంటూనే ఉంది. అమెరికాలో స్థిరపడిన భారతీయులు తమ పిల్లలకు శాస్త్రియ నృత్యాలను నేర్పిస్తూ సంస్కృతిని పరిరక్షిస్తున్నారు. జార్జియా రాష్ట్రం అట్లాంటాలో 17 ఏళ్ల లహరి పిసికె ప్రదర్శించిన కూచిపూడి అరంగేట్రం అమెరికన్లతో పాటు ఆహూతులైన తెలుగు వారిని విశేషంగా ఆకట్టుకుంది.
అట్లాంటాలో పలు సాఫ్ట్వేర్ సంస్థలు నిర్వహిస్తున్న వేణుకుమార్ రెడ్డి, వాసవి పిసెకె దంపతుల కుమార్తె అయిన లహరి 8వ ఏట నుంచే అభ్యాసం ప్రారంభించి తొలి అరంగేట్రం ప్రదర్శనతో అందరినీ అలరించింది. కూచిపూడిలోని అత్యంత కఠినమైన వంద రకాలు పాద ముద్రలు, శిల్ప సదృశ్య దేహ భంగిమలు, హస్త ముద్రలు, కళ్ల కదలికలతో ముఖంలో అనేక భావాలను పలికించి ప్రశంసలు పొందింది. విఘ్నేశ్వర, నటరాజ పూజలతో మొదలైన నాట్య ప్రదర్శన 4 గంటల పాటు నిర్విరామంగా సాగింది. తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలోని అల్వాల గ్రామం. 25 ఏళ్ల క్రితం అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అనుబంధ సంస్థ అయిన అమెరికా క్రికెట్ బోర్డు వ్యవస్థాపక సభ్యుడిగా ఆయన కొనసాగుతున్నారు.














