ఐక్యరాజ్య సమితి (ఐరాస) వాతావరణ సదస్సు కాప్ 26లో ప్గానేందుకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రోమ్ నుంచి గ్లాస్గో చేరుకున్నారు. గ్లాస్గోలో స్కాట్టాండ్ బ్యాగ్‌పేపర్లు బాణీలను ఆలపిస్తూ ఆయనకు స్వాగతం పలికారు. పెద్ద సంఖ్యలో భారత సంతతి ప్రజలు ఆయనను చూసేందుకు వచ్చారు. భారత్ మాతాకీ జై అంటు నినాదాలు చేశారు. గ్లాస్గో, ఎడిన్‌బరోకు చెందిన భారత సంతతి ప్రతినిధులు మోదీతో భేటీ అయ్యారు. వీరిలో ప్రముఖ వైద్యులు, విద్యావేత్తలు, వ్యాపారవేత్తలు ఉన్నారు. ఈ సందర్భంగా మోదీ తన శిలా ప్రతిమను ఆవిష్కరించారు. హకీం అనే న్రపవాస భారతీయ వైద్యుడు దీన్ని ప్రధానికి బహుకరించారు. ఈ విగ్రహాని పెట్టడం కోసం ప్రధాని తన కల్లద్దాలను ఇచ్చారు. బ్రిటన్ రాకుమారుడు ప్రిన్స్ విలయన్ నిర్వహించిన ఎర్త్ షార్ట్ ప్రైజ్ విజేత, ఢల్లీికి చెందిన రీసైక్లింగ్ సంస్థ టకాచార్ వ్యవస్థాపకుడు విద్యుత్ మోహన్, సౌర శక్తితో నడిచే ఇస్త్రీ బండిని రూపొందించిన 14 ఏళ్ల తమిళనాడు బాలిక వినిషా ఉమాశంకర్‌లను కలుసుకున్నారు. .
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/40ae94df-5916-473f-9c15-eadaf1b15c93-179x300.jpg)