Namaste NRI

ప్రవాస భారతీయులు హీరోలు :  సిబి జార్జి

జూన్‌ 14న ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా కువైత్‌తో ఇండియన్‌ ఎంబసీ కార్యాలయంలో ఇండియన్‌ డాక్టర్స్‌ ఫోరమ్‌తో కలిసి రక్తదాన శిబిరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కువైత్‌లోని భారత రాయబారి సిబి జార్జి మాట్లాడుతూ ప్రవాస భారతీయులపై ప్రశంసల వర్షం కురిపించారు. కువైత్‌లో ఉన్న రక్తదాతల్లో అత్యధికులు భారతీయ పౌరులే ఉన్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా యువకులు రక్తదానం చేసేందుకు ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు. రక్తదానం చేసేందుకు ముందుకు వస్తున్న భారతీయులను ఆయన హీరోలుగా అభివర్ణించారు. భారతీయుల సేవను కువైత్‌ అధికారులు కూడా గుర్తించి, ప్రశంసించినట్టు తెలిపారు.  రక్తదానం గురించి భారతీయుల్లో అవగాహన పెంచి, ప్రోత్సహిస్తున్న ఇండియన్‌ కమ్యూనిటీలను కూడా ఆయన అభినందించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events