విదేశీ ప్రయాణికులపై కొవిడ్ 19 అంక్షల్ని అమెరికా ఎత్తేయడంతో చాలా మంది అగ్రరాజ్యానికి న్రపయాణమయ్యేందుకు సిద్ధమయ్యారు. అయితే వారు వీసా అపాయింట్‌మెంట్ కోసం మరింత కాలం నిరీక్షించాల్సి అవసరం ఉంది.అమెరికా వెళ్లాలనుకునే వలసేతర వీసా కేటగిరీలవారు అపాయింట్‌మెంట్ కోసం నిరీక్షించక తప్పదని ఢల్లీిలోని ఆ దేశ దౌత్యకార్లాయయం తెలిపింది. కొవిడ్ 19 వల్ల తలెత్తిన అంతరాయల నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నందున వీసాదారులకు ఎదురుచూపులు తప్పవని పేర్కొంది. ఈ నెల 8 నుంచి భారత్ నుంచి దాదాపు 30 లక్షల మంది వీసాదారులు అమెరికా వెళ్లేందుకు అర్హులని తెలిపింది. నూతన అంతర్జాతీయ విమానయాన విధానం ప్రకారం వీరంతా వ్యాక్సినేషన్ పూర్తయినట్లు సర్టిఫికెట్లు చూపి, అమెరికా వెళ్లొవచ్చని తెలిపింది.
ఈ నెల 8 నుంచి అమెరికా వెళ్లేవారు వ్యాక్సినేషన్ పూర్తయినట్లు ధ్రువపత్రాలు చూపాలని, ఆయా టీకాలు ఎఫ్‌డీఏ అనుమతించినవి లేదా డబ్ల్యూహెచ్‌వో అత్యవసర వినియోగ జాబితాలో ఉన్నవి అయి ఉండాలని స్పష్టం చేసింది. కొవిషీల్డ్ టీకాను అనుమతిస్తున్నట్లు వెల్లడిరచింది. లక్షల మంది భారతీయులు వీసాల పునరుద్ధరణ/ కొత్త వీసాల జారీకి ఎదురుచూస్తుండడంతో యూఎస్ ఎంబసీల నుంచి అపాయింట్‌మెంట్లు అంత సులువుగా లభించే అవకాశాలు కనిపించడం లేదు. ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి యూఎస్ వెళ్లందుకు నిరీక్షిస్తున్న తెలుగువారు సైతం మరికొంత కాలం వేచిఉండాల్సి రావచ్చని యూఎస్ ఎంబసీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.