Skip to main content

Namaste NRI

బహిష్కరణ మోషన్ పోస్టర్ రిలీజ్

విలేజ్‌ రివేంజ్‌ డ్రామా నేపథ్యంలో రూపొందుతోన్న వెబ్‌ సిరీస్‌ బహిష్కరణ. అంజలి ఇందులో ప్రధాన పాత్రధారి. ముఖేశ్‌ ప్రజాపతి దర్శకుడు. జీ 5, ఫిక్సల్‌ పిక్చర్స్‌ ఇండియా సంస్థలు కలిసి ఈ సిరీస్‌ని నిర్మిస్తున్నాయ్‌. అంజలి పుట్టినరోజు సందర్భంగా ఈ వెబ్‌సిరీస్‌ మోషన్‌ పోస్టర్‌ని మేకర్స్‌ విడుదల చేశారు.

మంటల్లో కాలిపోతున్న ఓ కుర్చీ,  దాని పక్కనే వేటకొడవలి పట్టుకొని కోపంగా కూర్చున్న అంజలి.. పోస్టర్‌తోనే వెబ్‌సిరీస్‌పై ఆసక్తిని పెంచారు మేకర్స్‌. ఇందులో అంజలి పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని మేకర్స్‌ చెబుతున్నారు. త్వరలో స్ట్రీమింగ్‌కి రానున్న ఈ సిరీస్‌లో రవీంద్ర విజయ్‌, శ్రీతేజ్‌, అనన్య నాగళ్ల, షణ్ముక్‌, చైతన్యసాగిరాజు తదితరులు ఇతర పాత్రధారులు. ఈ సిరీస్‌కి కెమెరా: ప్రసన్నకుమార్‌, సంగీతం: సిద్ధార్థ్‌ సదాశివుని, నిర్మాత: ప్రశాంతి మలిశెట్టి.

Social Share Spread Message

Latest News