Namaste NRI

ఎక్స్‌ట్రా…నాకెంతో ప్రత్యేకం: నితిన్‌

నితిన్‌ కథానాయకుడిగా వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఎక్స్‌ట్రా ఆర్డినరీమ్యాన్‌. ఎన్‌.సుధాకర్‌ రెడ్డి, నికితా రెడ్డి నిర్మించారు. ఈ నెల 8న ప్రేక్షకుల ముందుకురానుంది. హైదరాబాద్‌లో ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించారు. నితిన్‌ మాట్లాడుతూ ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకం. ఇప్పటివరకు ఈ తరహా క్యారెక్టర్‌ చేయలేదు. నాయకానాయికలు రిత్విక్‌, ఖ్యాతీ పాత్రలతో ప్రేక్షకులు ప్రేమలో పడతారు అన్నారు. కామెడీ, మాస్‌ అంశాలతో సినిమా బాగా వచ్చింది. శ్రీలీల ఎంత బిజీగా ఉన్నా మాకు డేట్స్‌ కేటాయించింది. నిజ జీవితంతో తను ఎక్స్‌ట్రార్డినరీ ఉమెన్‌. ఈ సినిమా చూసిన నా ఫ్యాన్స్‌ అంతా కాలర్‌ ఎగరేసుకొని బయటకొస్తారు. పెద్ద హిట్‌ కొట్టబోతున్నామనే నమ్మకం ఉంది అన్నారు.

ఈ సినిమాలోని ప్రతి పాత్ర ప్రేక్షకులకు కనెక్ట్‌ అవుతుందని, రెండున్నర గంటల పాటు ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్విస్తామని దర్శకుడు వక్కంతం వంశీ తెలిపారు. ఈ సినిమా స్పెషల్‌ అప్పీయరెన్స్‌ పాత్రను చేశానని సీనియర్‌ నటుడు రాజశేఖర్‌ తెలిపారు. ఈ సినిమా విజయంపై పూర్తి నమ్మకం ఉందని, ప్రత్యేక పాత్రలో నటించిన రాజశేఖర్‌గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని నిర్మాతలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్‌ సభ్యులందరూ పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events