మోక్షగుండం విశ్వేశ్వరయ్య తన ఇంజినీరింగ్ ప్రతిభతో అసాధారణ విజయం సాధించారని టీఆర్‌ఎస్ ఎన్‌ఆర్‌ఐ సెల్ కో ఆర్డినేటర్ మహేష్ బిగాల అన్నారు. నిజామాబాద్ పాలిటెక్నిక్ కాలేజీ అలుమ్ని అసోసియేషన్ తరపున జరిగిన ఇంజినీరింగ్ సెలబ్రేషన్స్‌లో మహేష్ బిగాల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఇంజనీరుగా దేశ ఖ్యాతిని నలుదిశలా చాటారని అన్నారు. మోక్షగుండం విశ్వేర్వరయ్య జయంతి (సెప్టెంబరు 15) సందర్భంగా ఇంజినీర్స్ డే గా జరుపుకుంటున్నామని తెలిపారు. ఇంజినీరింగ్ రంగంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య ప్రపంచ ప్రఖ్యాత నిర్మాణాలను ఆవిష్కరించారని తెలిపారు. ఆయన మార్గదర్శకత్వంలో చేపట్టిన నిర్మాణాలు నేటికీ చెక్కు చెదరలేదంటే అతిశయోక్తి కాదన్నారు.
దేశంలోని యువ ఇంజినీర్లు దేశాన్ని నిర్మిస్తున్నారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య స్ఫూర్తితో ఇంకా ముందుకు వెళ్లాలని సూచించారు. అనంతరం బిగాల కృష్ణమూర్తి ఫౌండేషన్ తరపున కాలేజీలో అత్యంత ప్రతిభ కనబర్చిన వారికి, టీఎస్ ఈసెట్‌లో మంచి ర్యాంక్స్ సాధించిన వారికి ఉపకార వేతనాలు అందిస్తామని ప్రకటించారు.