Skip to main content

Namaste NRI

సియాటిల్‌లో దీపావ‌ళి వేడుక‌ల్ని అడ్డుకున్న అతివాదులు

అమెరికాలోని సియాటిల్‌లో దీపావ‌ళి వేడుక‌ను అతివాదులు అడ్డుకున్నారు. అమెరికా ఫార్ రైట్ కార్య‌క‌ర్త జేక్ లాంగ్‌, త‌న‌తో క‌లిసిన కొంద‌రు గ్రూపు స‌భ్యులు, దీపావ‌ళి పండుగ సంబ‌రాలను అడ్డుకున్నారు. కార్య‌క్ర‌మం వద్ద ప్ల‌కార్డులు ప‌ట్టుకున్నారు. డాట్ హెడ్స్‌ను డిపోర్ట్ చేయాల‌ని లాంగ్ ప్ల‌కార్డు ప్ర‌ద‌ర్శించాడు. ఆ స‌మ‌యంలో అక్క‌డ ఉన్న కొంద‌రు అత‌న్ని భౌతికంగా నిలువ‌రించారు. హిందువుల‌పై ఆయ‌న అనుచిత వ్యాఖ్య‌లు చేశారు. టెక్సాస్‌లో డెమోక్ర‌టిక్ పార్టీ గెల‌వ‌డానికి హిందువులే కార‌ణ‌మ‌ని ఆయ‌న ఆరోపించారు. వైట్ రిప్లేస్‌మెంట్ అనే సంస్థ‌కు లాంగ్ అధిప‌తిగా ఉన్నారు.

అమెరికా క్యాపిట‌ల్ హిల్‌పై 2021 జ‌న‌వ‌రి ఆరో తేదీన జ‌రిగిన ఘ‌ట‌న‌లోనూ అత‌ను ఉన్నాడు. నాలుగేళ్లు జైలుశిక్ష అనుభ‌వించాడు. ట్రంప్ అత‌నికి క్ష‌మాభిక్ష పెట్టారు. దీంతో అత‌ను 2025లో రిలీజ్ అయ్యాడు. రెండు రోజుల క్రితమే శ్వేత సౌధంలో ట్రంప్ దీపావ‌ళి వేడుక‌లు సెల‌బ్రేట్ చేసుకున్న విష‌యం తెలిసిందే.

లాంగ్ నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌ను చ‌ట్ట‌స‌భ‌ల ప్ర‌తినిధి ప్రమీలా జ‌య‌పాల్ ఖండించారు. జాత్యాంహ‌కార విధానాన్ని వ్య‌తిరేకిస్తున్న‌ట్లు చెప్పారు. హిందువుల‌కు దీపావ‌ళి ముఖ్య‌మైన వేడుక అని, ఆ పండుగ‌ను సెల‌బ్రేట్ చేసుకునేందుకు తాము సేఫ్‌గా ఉన్న‌ట్లు ఫీల‌వ్వాల‌ని, ఇలాంటి విద్వేష‌పూరిత నిర‌స‌న‌కు ఈ దేశంలో చోటు లేద‌ని ప్ర‌మీలా ఆరోపించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events