ఉచిత మెగా కంటి శిబిరం నాట్స్ అధ్యక్షులు నూతి బాపయ్య చౌదరి(బాపు) ఆధ్వర్యంలో తెలంగాణా రాస్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో ఆదివారం జరిగింది. పెద్ద ఎత్తున చుట్టు పక్కల తాండల ప్రజలు వచ్చి కళ్ళ పరీక్షలు చేయించుకోన్నారు. 1000మంది కి కంటి పరీక్షలు చేశారు. పరీక్షలు అయిన వెంటనే శంకర్ నేత్రాలయం బస్సులో శుక్లాల ఆపరేషన్ ల కొరకు తీసుకువెళ్లారు. పరీక్షలు కొరకు వచ్చిన ప్రజలకు నాట్స్ ఆధ్వర్యంలో భోజనాలు ఏర్పాటు చేశారు. బాపు మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల్లో నాట్స్, గ్లౌ ఫౌండేషన్ మరియు శంకర్ నేత్రాలయం సంయుక్తంగా మెగా కంటి శిబిరాల ద్వారా నిరుపేదలకు ఉచితంగా కంటి పరీక్షలు, ఆపరేషన్స్, మరియు కళ్ల జోళ్ల పంపిణి అందించనున్నమని తెలిపారు. ఇంకా భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్, ప్రజాప్రతినిధులు, నాట్స్ వలంటీర్లు పాల్గొన్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2023/06/9f49e8d2-8280-46f1-9cd4-82d86a88c854-49-126-4-253.jpg)
![](https://namastenri.net/wp-content/uploads/2023/06/45af6911-9449-466d-a7e1-ba146800284b-124-4-254.jpg)
![](https://namastenri.net/wp-content/uploads/2023/06/638bff07-efd2-4cc9-8546-98039833db3c-132-4-254.jpg)