విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి సమ్మర్ సోగ్గాళ్లుగా వేసవికి మూడు రెట్ల వినోదాన్ని ఇచ్చేందుకు ఎఫ్3 సినిమాతో రాబోతున్నారు. వెంకీ సరసన తమన్నా, వరున్ సరసన మెహరీన్ కనిపిస్తారు. అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమాను దిల్‌రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై శిరీష్ నిర్మిస్తున్నారు. వరుణ్‌తేజ్ పుట్టిన రోజు సందర్భంగా ఎఫ్3 టీం నుంచి బ్రాండ్ న్యూ పోస్టర్ విడుదల చేసింది. ఈ పోస్టర్లో వరుణ్ సరికొత్తగా కన్పిస్తున్నారు. ఈ సినిమా అంతా కూడా డబ్బు చుట్టూ తిరుగుతుందని ఇది వరకే యూనిట్ తెలిపింది. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్లో కూడా వరుణ్‌తేజ్ చేతిలో కరెన్సీ నోట్లు కన్పిస్తున్నాయి. వేసవి సందర్భంగా ఏప్రిల్ 28న ఈ చిత్రం విడుదల కానుంది. రాజేంద్రప్రసాద్, సునీల్ వంటి వారితో ఈ సినిమా మరింత వినోదాత్మకంగా మారనుంది. తమన్నా, మెహరీన్ నటన ప్లస్ అవుతుందన్నారు. సోనాల్ చౌహాన్ కూడా నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలందిస్తున్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/protests-300x160.jpg)