కెనడాలోని ఒంటారియో ప్రావిన్స్‌లో భారత సంతతికి చెందిన దంపతులు, వారి కుమార్తె అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ నెల 7న బ్రాంప్టన్‌లోని వారి నివాసంలో మంటలు చెలరేగి సజీవ దహనమయ్యా రు. దీంతో గుర్తుపట్టలేనంతగా కాలిపోయిన మృతదేహాలకు పోలీసులు పరీక్షలు జరిపారు. మృతులను భారత సంతతికి చెందిన రాజీవ్ వరికూ (51), అతని భార్య శిల్ప కొత్త (47) వారి కుమార్తె మహెక్ వరికూ (16)గా నిర్ధారించారు. మంటలు చెలరేగటానికి ముందు ఆ ఇంట్లో పెద్ద శబ్దంతో పేలుడు సంభవించినట్లు స్థానికులు తెలిపారు. కాగా, ఈ ఘటనపై ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రమాద వశాత్తు జరిగిందని తాము భావించడం లేదని తెలిపారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.