Namaste NRI

షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఫ్యామిలీ స్టార్

విజయ్‌ దేవరకొండ, మృణాల్‌ఠాకూర్‌ జంటగా జంటగా నటిస్తున్న చిత్రం ఫ్యామిలీస్టార్‌. పరశురామ్‌ పెట్ల దర్శకత్వం.  దిల్‌రాజు, శిరీష్‌ నిర్మిస్తున్నారు.  ఈ  చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుంది. మూవీ టీమ్‌ గుమ్మడి కాయ కూడా కొట్టేశారు. అన్ని వర్గాలవారికీ నచ్చే వినోదభరితచిత్రంగా దర్శకుడు పరుశురామ్‌ పెట్ల ఈ చిత్రా న్ని తెరకెక్కించారని, ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు పెంచాయని, ఈ సమ్మర్‌ బ్లాక్‌బాస్టర్‌గా ఫ్యామిలీ స్టార్‌ నిలవడం ఖాయమని దిల్‌రాజు తెలిపారు.  నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసి ఏప్రిల్‌ 5న సినిమా ను విడుదల చేయడానికి మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: కేయూ మోహనన్‌, సంగీతం: గోపీసుందర్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events