Namaste NRI

లిల్లీ ట్రైలర్‌ను విడుదల చేసిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు

నేహా ప్రధాన పాత్రలో నటించిన బాలల సినిమా లిల్లీ. ఈ చిత్రాన్ని గోపురం స్టూడియోస్ పతాకంపై కె బాబు రెడ్డి, జి.సతీష్ కుమార్ నిర్మించారు. శివమ్ దర్శకుడు.  వేదాంత్ వర్మ, ప్రణితా రెడ్డి, రాజ్వీర్ కీలక పాత్రలు పోషించారు. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నది. తాజాగా చిత్ర ట్రైలర్‌ను  ప్రముఖ నిర్మాత దిల్ రాజు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లిటిల్ సోల్జర్స్,  అంజలి వంటి చిన్న పిల్లల సినిమాలు నాకు బాగా ఇష్టం. డిస్ట్రిబ్యూటర్‌గా  సిసీంద్రి చిత్రాన్ని పంపిణీ చేశాను. మంచి కాన్సెప్ట్‌తో  రూపొందిస్తే పిల్లల సినిమాలు ఆదరణ పొందుతాయి. ఈ చిత్రంతో శివమ్ అలాంటి ప్రయత్నమే చేశారనిపిస్తున్నది. ట్రైలర్ ఆకట్టుకుంది అన్నారు. దర్శకుడు శివమ్ మాట్లాడుతూ భావోద్వేగాలతో ఆకట్టుకునే చిత్రమిది. ప్రేక్షకుల్ని కంటతడి పెట్టిస్తుంది. తల్లిదండ్రులు తమ పిల్లలకు ఈ సినిమా చూపించాలనుకునేంత బాగుంటుంది అన్నారు. ఈ కార్యక్రమంలో నటీ నటులు నేహ, వేదాంత్ వర్మ, ప్రణితారెడ్డి, రాజ్వీర్ తదితరులు  పాల్గొన్నారు.ఈ చిత్రానికి సాంకేతిక నిపుణులు బ్యానర్ : గోపురం స్టూడియోస్, నిర్మాతలు :కె.బాబు రెడ్డి, జి. సతీష్ కుమార్, కెమెరా- యస్. రాజ్‌కుమార్,  సంగీతం- ఆంటో ఫ్రాన్సిస్, ఎడిటర్- లోకేశ్ కడలి, ఫైనల్‌మిక్సింగ్‌- సినోయ్ జోసెఫ్, సౌండ్- జుబిన్ రాజ్, వీఎఫ్‌ఎక్స్‌ – ఆర్క్ వర్క్స్.  లిరిక్స్ : తిరుపతి, అలరాజు,  ఫోన్. ఆర్. ఓ : శివ మల్లాల.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events