ప్రముఖ గాయని కేఎస్ చిత్రకు అరుదైన గౌరవం దక్కింది. ఆమెకు యూఏఈ సర్కార్ గోల్డెన్ వీసా మంజూరు చేసింది. పదేళ్ల కాలపరిమితితో చిత్రకు యూఏఈ ఈ లాంగ్‌టర్మ్ రెసిడెన్సీ వీసాను జారీ చేసింది. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారినర్స్ అఫైర్స్ (జీడీఆర్ఎఫ్ఏ) డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ మహమ్మద్ అహ్మద్ అల్ మర్రీ చేతుల మీదుగా దుబాయ్లఓ చిత్ర ఈ గోల్డెన్ వీసా అందుకున్నారు. జీడీఆర్ఎఫ్ఏ డైరెక్టర్ జనరల్ నుండి గోల్డెన్ వీసా అందుకున్నందుకు సంతోషంగా, గౌరవంగా, విశేషంగా భావిస్తున్నట్లు చిత్ర పేర్కొన్నారు. ఇక భారతీయ సినీ రంగంలో ఆమె ఎన్నో మైలురాయి దాటారు. ఇప్పటి వరకు వివిధ భాషల్లో 25 వేలకు పైగా పాటలు పాడారామె. అరసార్లు జాతీయ అవార్డు అందుకున్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/donaldTrump-3-300x160.jpg)