కేథరిన్ ట్రెసా ప్రధాన పాత్రలో నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ఫణి. వి.ఎన్.ఆదిత్య దర్శకత్వం. ఈ చిత్రాన్ని ఓ.ఎం.జీ ప్రొడక్షన్స్ పతాకంపై డాక్టర్ మీనాక్షి అనిపిండి నిర్మిస్తున్నారు. మహేష్‌శ్రీరామ్ కీలక పాత్రధారి. హైదరాబాద్‌లో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చేతుల మీదుగా మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. తొలుత చిన్న చిత్రంగా ఆరంభమైన ఈ ప్రాజెక్ట్ అనంతరం గ్లోబల్ మూవీగా తయారైందని, ఇందులో పాము పాత్ర చాలా కీలకంగా ఉంటుందని చిత్ర నిర్మాత, సంగీత దర్శకురాలు డా॥ మీనాక్షి పేర్కొన్నారు. తన మీద నమ్మకంతో సోదరి మీనాక్షి, బావ శాస్త్రి ఈ సినిమా ద్వారా ప్రొడక్షన్‌లోకి ఎంటరయ్యారని, వినూత్నమైన కాన్సెప్ట్‌తో గ్లోబల్ మూవీగా తెరకెక్కించామని, త్వరలోనే ప్రేక్షకుల ముందుకుతీసుకొస్తామని దర్శకుడు వి.ఎన్.ఆదిత్య తెలిపారు.

ఇలాంటి వైవిధ్యమైన కథలో ఎప్పుడూ నటించలేదని, పాము నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు హైలైట్‌గా నిలుస్తాయని కథానాయిక కేథరిన్ తెలిపింది. ఈ కథలో భూమి మనది మాత్రమే కాదు, ప్రకృతిది కూడా అనే గొప్ప సందేశం ఉంటుందని రైటర్ పద్మ అన్నారు. భారీ స్థాయిలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నామని చిత్ర సమర్పకులు పద్మనాభ రెడ్డి చెప్పారు. ఈ చిత్రానికి సమర్పణ: ఏయు అండ్ ఐ స్టూడియో పద్మనాభ రెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వీఎన్ ఆదిత్య.
