Namaste NRI

ఫర్హాన్‌ అక్తర్‌ 120 బహదూర్‌ టీజ‌ర్ విడుద‌ల

బాలీవుడ్ న‌టుడు ఫర్హాన్ అక్తర్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన తాజా చిత్రం 120 బహదూర్‌. 1962లో జరిగిన భారత్-చైనా యుద్ధం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీని రజనీష్‌ (రాజీ ఫేమ్) ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా,  పరమ వీర చక్ర పురస్కార గ్రహీత మేజర్ సైతాన్ సింగ్ భాటి పాత్రలో ఫర్హాన్ అక్తర్ న‌టించ‌బోతున్నాడు. రాశీఖన్నా కీల‌క పాత్ర‌లో న‌టిస్తుంది. ఈ చిత్రం నవంబర్ 21, 2025న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుండ‌గా తాజాగా టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు మేక‌ర్స్. భాగ్ మిల్కా భాగ్ త‌ర్వాత ఫర్హాన్ అక్తర్ మ‌రోసారి బ‌యోపిక్ చేస్తుండ‌టంతో ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events