నాంది చిత్రంతో కమర్షియల్ హిట్ అందించిన అల్లరి నరేష్, విజయ్ కనకమేడల మరో యూనిక్, ఇంటెన్స్ మూవీ ఉగ్రం తో వస్తున్నారు. అల్లరి నరేష్ ని ఫెరోషియస్ పోలీస్ గా చూపించిన ఉగ్రం టీజర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ సింగిల్ దేవేరి సాంగ్ ని గ్రాండ్ గా లాంచ్ చేశారు మేకర్స్. మనసుకు ఎంతగానో నచ్చేసే పాటిది. ట్యూన్, లిరిక్స్, కంపోజిషన్ మనసుల్ని ఆకట్టుకుంటాయి.
శ్రీచరణ్ పాకాల మెలోడి, రొమాంటిక్ నెంబర్ ని అందించారు. శ్రీమణి సాహిత్యం ఆకట్టుకోగా అనురాగ్ కులకర్ణి మ్యాజికల్ వాయిస్ మరింత మాధుర్యాని తెచ్చాయి. అల్లరి నరేష్, మిర్నాల కెమిస్ట్రీ చక్కగా కుదిరింది. ఈ పాట లీడ్ పెయిర్ ఒకరికొకరు ఉన్న అనురాగాన్ని ప్రజంట్ చేస్తోంది. ఈ చిత్రానికి టూమ్ వెంకట్, అబ్బూరి రవి స్టోరీ, డైలాగ్స్ అందిస్తున్నారు. షైన్ స్క్రీన్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది తెరకెక్కిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల బ్యాక్ గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ సినిమాకు మరింత హైప్ తీసుకురావడం గ్యారంటీ అని వీడియో సాంగ్ చెప్పేస్తుంది. ఉగ్రం మే 5న థియేటర్లలో సందడి చేయనుండగా టీం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.