అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ బడ్డీ. గాయత్రి భరద్వాజ్, ప్రిషా రాజేశ్‌సింగ్ ఇందు లో హీరోయిన్లు. శామ్ ఆంటోన్ దర్శకుడు. కేఈ జ్ఞానవేల్‌రాజా, అధన జ్ఞానవేల్‌రాజా నిర్మాతలు. ప్రమోషన్‌లో భాగంగా ఇందులోని ఫీల్ ఆఫ్ బడ్డీ లిరికల్ సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు. చూశాలే.. చూశాలే.. చూశాలే నీలో నా కలనే.. దాచాలే.. దాచాలే.. దాచాలే నాలో ఆ కలనే అంటూ సాగే ఈ పాటను సాయిహేమంత్ రాయగా, హిప్ హాప్ తమిళ స్వరపరిచి, ఐరా ఉడుపితో కలిసి ఆలపించారు. యువతరానికి నచ్చే కథ, కథనాలతో ఈ సినిమా సాగుతుందని మేకర్స్ చెబుతున్నారు. అజ్మల్ అమీర్, ముఖేశ్ కుమార్, అలీ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ నెల 26న సినిమా విడుదల కానుంది. ఈ చిత్రానికి కెమెరా: కృష్ణన్ వసంత్, నిర్మాణం: స్టూడియో గ్రీన్ ఫిల్మ్స్.