అర్జెంటీనా మూడున్నర దశాబ్దాల నిరీక్షణ ఫలించింది. సూపర్‌స్టార్ మెస్సి స్వప్నం సాకారమైంది. అనేక మలుపులతో అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో ఫ్రాన్స్‌ను ఓడిస్తూ అర్జెంటీనా ఫిఫా ప్రపంచకప్ విజేతగా నిలిచింది. షూ టౌట్లో అర్జెంటీనా గోల్‌కీపర్ ఎమిలియానో మార్టినెజే హీరో, ఫ్రాన్స్ తరపున మొదటి పెనాల్టీని ఎంబాపె సద్వినియోగం చేయగా, ఆ తర్వాత అర్జెంటీనా తరపున మెస్సి స్కోవర్ చేశాడు. ఆ తర్వాత ఫ్రాన్స్ తరపున కోమన్( రెండో పెనాల్టీ), చౌమని ( మూడో పెనాల్టీ) వరుసగా విఫలం కావడంతో అర్జెంటీనా అభిమానులు సంబరాలు చేసుకున్నారు. అర్జెంటీనా తరపున రెండు, మూడో ప్రయత్నాల్లో డిబరా పరేదెస్ విజయవంతం కావడంతోఎ ఆ జట్టు 3`1తో ఆధిక్యంలో నిలిచింది.