ఆమె వయసు 35 ఏండ్లు. ఒంటరిగానే ఉంటోంది. కొన్నాళ్లు డేటింగ్లో మునిగి తేలింది. కానీ ఆ జీవితం ఆమెకు నచ్చలేదు. డేటింగ్‌కు స్వస్తి పలికి ఓ తోడు కావాలని ఆమె కోరుకుంటోంది. అయితే తనకు ఓ పెళ్లి కుమారుడిని చూసి పెట్టిన వారికి భారీ నజరానా ఇస్తానని వెల్లడించింది. తనకు భర్తను వెతికి పెట్టిన వారికి బహుమతిగా 5 వేల డాలర్లు(రూ. 4,10,462) ఇస్తానని ప్రకటన చేసింది. అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌కు చెందిన ఈవ్ టిల్లే కౌల్సన్(35) కార్పొరేట్ లిటిగేషన్ అటార్నీగా పని చేస్తుంది. కానీ ఒంటరిగా ఉంటూ ఐదేండ్ల పాటు డేటింగ్ చేసింది. అయితే ఆమెకు ఈ డేటింగ్ జీవితం మీద విరక్తి రావడంతో.. తనకంటూ ఓ తోడు ఉండాలని నిర్ణయించుకుంది. దీంతో తనకు పది లక్షల ఫాలోవర్లు ఉన్న టిక్ టాక్ వేదికగా కౌల్సన్ ప్రకటన చేసింది. తనకు భర్తను వెతికి పెడితే 5 వేల డాలర్లు బహుమతిగా ఇస్తానని ప్రకటించింది. అయితే మీరు వెతికిపెట్టే భర్తతో ఎక్కువ కాలం ఉండలేను. కేవలం 20 సంవత్సరాలు మాత్రమే ఉండి, ఆ తర్వాత విడాకులు ఇస్తాను. ఇక పెళ్లైన తర్వాత రిజిస్ట్రేషన్ దస్త్రంపై సంతకం చేసిన తర్వాత తనకు పెళ్లి సంబంధం చూసిన వ్యక్తికి తాను చెప్పిన విధంగానే నగదు బహుమతిని అందిస్తానని కౌల్సన్ ప్రకటించింది.














