ఉక్రెయిన్‌లో రష్యా దాడులు కొనసాగుతున్న వేళ మరో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. నాటో దళంలో ఫిన్‌ల్యాండ్ చేరనున్నది. ఈ నేపథ్యంలో ఆ దేశం సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకోనున్నది. ఫిన్‌ల్యాండ్ ప్రెసిడెంట్ సౌలీ నీనిస్టో, ప్రధాని సన్నా మారిన్ దీనిపై సంయుక్త ప్రకటన చేశారు. ఎటువంటి ఆలస్యం లేకుండా నాటో సభ్యత్వం కోసం ఫిన్‌ల్యాండ్ దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఉక్రెయిన్‌పై రష్యా ఆక్రమణ చేపట్టిన నేపథ్యంలో ఫిన్‌ల్యాండ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. గతంలో ఈ రెండు దేశాల మధ్య సరిహద్దు సమస్యలు ఉత్పన్నం అయ్యాయి. నాటో బృందంలో స్వీడెన్ కూడా చేరే అవకాశాలు ఉన్నాయి. అయితే ఫిన్‌ల్యాండ్, స్వీడెన్ తీసుకున్న నిర్ణయాలను రష్యా తప్పుపడుతోంది. ఫిన్‌ల్యాండ్, రష్యా మధ్య 1300 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. దీంతో ఉక్రెయిన్ తరహాలోనే రష్యా ఫిన్‌ల్యాండ్‌పై దాడులు చేసే అవకాశం లేకపోలేదు. ఈ నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేసుకునేందుకే ఫిన్‌ల్యాండ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/protests-300x160.jpg)