Namaste NRI

ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో లిరికల్‌ వీడియో

శ్రీకాంత్‌ రెడ్డి, సంచిత బాషు జంటగా వంశీధర్‌ గౌడ్‌ లక్ష్మీనారాయణ పి.సంయుక్తంగా దర్శత్వం వహిస్తున్న చిత్రం ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో.  రథన్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి మజా  మజ్జా అంటూ సాగే మొదటి లిరికల్‌ వీడియోను చిత్రయూనిట్‌ విడుదల చేసింది. ఈ పాటకు వంశీధర్‌ గౌడ్‌, వాసు వలబోజుల సాహిత్యం అందించారు. ఆంథోనిదాసన్‌ పాడగా, విశ్వ రఘు కొరియోగ్రఫీ అందించారు. సరికొత్త కామెడీ ఎంటర్‌టైనర్‌ చిత్రమిది. జాతిరత్నాలు ఫేమ్‌ డైరెక్టర్‌ అనుదీప్‌ కేవీ ఈ చిత్రం రచనా విభాగంలో ఉన్నారు అని చిత్ర యూనిట్‌ పేర్కొంది. ఏడిద శ్రీరామ్‌ సమర్పణలో శ్రీజ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, మిత్రవింద మూవీస్‌పై శ్రీజ నిర్మిస్తున్నారు. తనికెళ్ల భరణి, వెన్నెల కిషోర్‌, శ్రీనివాస్‌ రెడ్డి, మహేష్‌ ఆచంట కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం : ప్రశాంత్‌ అంకిరెడ్డి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events