మరోసారి మాస్ లుక్‌లో సందడి చేస్తున్నారు బాలయ్య. ఆయన హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఆయన 107వ సినిమాగా మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. శ్రుతీహాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్‌కుమార్. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ తెలంగాణలోని సిరిసిల్ల లొకేషన్స్‌లో ఆరంభమయింది. రామ్, లక్ష్మణ్ సమకూర్చిన యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొంటున్నారు బాలకృష్ణ. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఈ లుక్‌ని బట్టి బాలకృష్ణ మాస్ క్యారెక్టర్లో కనిపించనున్నారని తెలుస్తోంది. ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా కన్నడ నటుడు దునియా విజయ్ తెలుగు పరిశ్రమకి పరిచయమవుతున్నారు. వాస్తవ సంఘటనల స్ఫూర్తితో రూపొందుతున్న చిత్రమిది. ఈ చిత్రానికి నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: తమన్, ఛాయాగ్రహణం : రిషి పంజాబీ, ప్రొడక్షన్ డిజైన్: ఎ.ఎస్.ప్రకాశ్, మాటలు: సాయిమాధవ్ బుర్రా, కూర్పు: నవీన్ నూలి.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/protests-300x160.jpg)