సీనియర్ నటుడు నరేష్ సినీ పరిశ్రమలో 50 గోల్డెన్ ఇయర్స్ ని పూర్తి చేసుకున్న సందర్భంగా గోల్డెన్ జూబ్లీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. ఈ చిత్రంలో నరేష్ కు జోడిగా పవిత్రా లోకేష్ నటిస్తున్నారు. ఎం.ఎస్.రాజు దర్శకుడు. విజయకృష్ణ మూవీస్ పతాకంపై నరేష్ నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా ఈ చిత్రం టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మళ్లీ పెళ్లి అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఫస్ట్-లుక్ పోస్టర్‌లో ఓ అందమైన ఇంటిముందు పవిత్ర లోకేష్ ముగ్గు వేస్తుండగా సాంప్రదాయ దుస్తులలో నరేష్ ఆ ముగ్గు వేయడాన్ని ఆనందంగా చూస్తూ కనిపించారు.
కుటుంబ కథా చిత్రమిది. నరేష్, పవిత్రాలోకేష్ జోడీ ప్రధానాకర్షణగా ఉంటుంది. వినోదం, భావోద్వేగాలు కలబోతగా మెప్పిస్తుంది అని చిత్రబృందం పేర్కొంది. జయసుధ, శరత్‌బాబు, అనన్య నాగళ్ల తదితరులు నటిస్తున్నారు. తెలుగు, కన్నడ భాషల్లో రూపొందిస్తున్నారు. ఈ వేసవిలో చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఎం.ఎన్.బాల్ రెడ్డి, సంగీతం: సురేష్ బొబ్బిలి, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్: అరుల్ దేవ్, ఎడిటర్: జునైద్ సిద్ధిక్, పాటలు: అనంత శ్రీరామ్, రచన-దర్శకత్వం: ఎం.ఎస్.రాజు.