విజయ్, రష్మిక మందన్న నటిస్తున్న కొత్త సినిమా వారసుడు. ఈ సినిమాను దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్నారు. తమిళంలో వరిసు పేరుతో ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీవీ సినిమా పతాకాలపై దిల్ రాజు శిరీష్, పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్ర తమిళ వెర్షన్ నుంచి విడుదల చేసిన రంజితమే, పాటకు మంచి స్పందన దక్కింది. ఇప్పటిదాకా ఈ పాటకు యూట్యూబ్‌లో ఏడున్నర కోట్ల వ్యూస్ వచ్చాయి. తాజాగా ఈ పాట తెలుగు వెర్షన్ విడుదల చేశారు. థమన్ స్వరపర్చిన ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించగా అనురాగ్ కులకర్ణి, మానసి పాడారు. ఇందులో వానవిల్లు చీర తెచ్చా, కట్టుకున్న న్ని మొచ్చా అనే అకట్టుకునే పదాలు రాశారు గీత రచయిత. తెలుగు లో కూడా రంజితమే పాట విజయం సాధిస్తుందని చిత్ర బృందం చెబుతున్నారు. తుది దశ రూపకల్పనలో ఉన్న ఈ సినిమా వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.
