విశ్వక్‌సేన్, నేహాశెట్టి జంటగా నటిస్తున్న చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. కృష్ణ చైతన్య దర్శకుడు. సూర్యదేవర నాగవంశీ,సాయి సౌజన్యనిర్మాతలు. ఈ సినిమాలో మరో బ్యూటీ అంజలి కీలకపాత్రలో కనిపించనుంది. చాలా కాలం తర్వాత ఈ సినిమాలో విశ్వక్ మరోసారి ఫుల్ మాస్ అవతారంలో కనిపించనున్నారు. ఈ చిత్రంలోని మొదటి గీతం సుట్టంలా సూసి అనే లిరికల్ వీడియో సాంగ్‌ను మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ గోదావరి డెల్టా నేపథ్యంలో కొనసాగే పీరియడ్ గ్యాంగ్‌స్టర్ డ్రామా ఇది. యువన్ శంకర్‌రాజాతో పనిచేయాలన్న నా కోరిక ఈ చిత్రంతో తీరింది. ఆయనకు నేను పెద్ద అభిమానిని అన్నారు. విశ్వక్‌సేన్ మాట్లాడుతూ తాజాగా విడుదల చేసిన పాట సాఫ్ట్‌గా వుంటుంది. కానీ సినిమా మాత్రం మాస్‌గా వుంటుంది. థియేటర్లలో ఒక్కొక్కరికి శివాలెత్తిపోతుంది అన్నారు. హీరోయిన్ నేహాశెట్టి, నిర్మాత నాగవంశీ, యువన్ శంకర్‌రాజా, చిత్రయూనిట్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
