Skip to main content

Namaste NRI

నాగచైతన్య వృషకర్మ నుంచి స్వాగ్ ఆఫ్ అర్జున్ ఫస్ట్ సింగిల్ విడుదల

అక్కినేని నాగచైతన్య హీరోగా రూపొందుతున్న మైథలాజికల్‌ థ్రిల్లర్‌ వృషకర్మ.మీనాక్షి చౌదరి కథానాయిక. కార్తీక్‌ దండు దర్శకుడు. బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌, సుకుమార్‌.బి నిర్మాతలు.ఈ చిత్రంలో స్పర్శ్‌ శ్రీవాస్తవ విలన్‌గా నటిస్తున్నారు. ఈ సందర్భంగా సినిమా ప్రచారాన్ని మేకర్స్‌ వేగవంతం చేశారు. ఈ సినిమా నుంచి స్వాగ్‌ ఆఫ్‌ అర్జున్‌ ఫస్ట్‌ సింగిల్‌ని మేకర్స్‌ విడుదల చేశారు.

ఈ సినిమాలో నాగచైతన్య నటిస్తున్న ట్రెజర్‌ హంటర్‌ అర్జున్‌ పాత్రను ఈ పాట పరిచయం చేసింది. ైస్టెల్‌, ఆటిట్యూడ్‌, ఎనర్జీతో అసాధారణమైన సాహసయాత్రకు సిద్ధమవుతున్న ట్రెజర్‌ హంటర్‌గా ఈ పాటలో చైతూ కనిపించారు. కథానాయకుడి స్వాగ్‌నీ, ఆటిట్యూడ్‌ను ఆవిష్కరిస్తూ అభినవకవి రాసిన ఈ పాటను బి.అజనీష్‌ లోక్‌నాథ్‌ ట్రెండీ బీట్స్‌తో కంపోజ్‌ చేసి, స్వయంగా ఆలపించారు. నాగచైతన్య దృఢమైన శరీరం, కమాండింగ్‌ స్క్రీన్‌ ప్రెజెన్స్‌ ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. డిసెంబర్‌ 4న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులకు ఓ గొప్ప థియేట్రికల్‌ ఎక్స్‌పీరియన్స్‌ను అందించేందుకు ఈ సినిమా సిద్ధమవుతున్నది. ఈ చిత్రానికి కెమెరా: రఘుల్‌ డి.హెరియన్‌, సంగీతం: అజనీష్‌ బి.లోక్‌నాథ్‌, సమర్పణ: బాపినీడు, నిర్మాణం: శ్రీవెంకటేశ్వర సినీచిత్ర, సుకుమార్‌ రైటింగ్స్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events