అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెల్లడవుతున్నాయి. ఇదిలాఉంటే డెలవేర్ లోని ఎట్ లార్జ్ హౌస్ డిస్ట్రిక్ట్ నుంచి డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేసిన సారా మెక్‌బ్రైడ్ విజయం సాధించారు. దీంతో కాంగ్రెస్ కు ఎన్నికైన తొలి ట్రాన్స్ జెండర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు.
సారా మెక్‌బ్రైడ్ జాతీయ ఎల్‌జీబీటీక్యూ కార్యకర్తగా చ్చేస్తున్నారు. దాంతో ఆవిడ ఎన్నికల సమయంలో ఏకంగా 30 లక్షల డాలర్స్ కు పైగా ప్రచార విరాళాలు సేకరించింది. 2016లో, డెమోక్రటిక్ నేషనల్ కన్వెన్షన్ లో ఒక ప్రధాన పార్టీని ఉద్దేశించి ప్రసంగించిన మొదటి లింగమార్పిడి వ్యక్తిగా ఆమె పేరు గాంచింది. డెలావేర్ నుండి ఆవిడ 2020లో మొదటి ట్రాన్స్‌స్టేట్ సెనేటర్ అయ్యారు. 2010 నుండి, డెలావేర్ ఓటర్లు డెమొక్రాట్ లకు మద్దతిస్తున్నారు. ఈ నేపథ్యంలో సారా మెక్‌బ్రైడ్ ప్రస్తుత ఎన్నికల్లో విజయం సాధించారు.