లోక్‌సభ ఎన్నికల్లో ఓటేయడం మిస్ కావొద్దని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూరి(సీజేఐ) డీవై చంద్రచూడ్ దేశ పౌరులకు విజ్ఞప్తి చేశారు. రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్యంలో అది ప్రథమ ప్రాధాన్యం కలిగిన బాధ్యతని తెలిపా రు. నా ఓటు నా గళం మిషన్‌లో భాగంగా ఎన్నికల సంఘం కోసం ఆయన వీడియో సందేశం ఇచ్చారు. రాజ్యాంగం నిర్దేశించిన విధులను నెరవేర్చాల్సిన బాధ్యత మనపై ఉందని సీజేఐ పేర్కొన్నారు. ఐదేండ్లకు ఒకసారి దేశం కోసం ఐదు నిమిషాలు కేటాయించండి. గర్వంగా ఓటేయండి. నా ఓటు నా గళం అని సీజేఐ అన్నారు. న్యాయవాదిగా ఉన్నప్పుడు ఎంత బిజీగా ఉన్నా ఎప్పుడూ ఓటేయడం మానలేదన్నారు. వేలిపై సిరా చుక్క వేయించుకొని ఓటేసినప్పుడు నాలో దేశభక్తి ఉప్పొంగి దేశంతో అనుసంధానమయ్యానన్న ఉద్వేగం కలుగుతుంది అని సీజేఐ అన్నారు.