దుబాయ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ కంపెనీలలో పని చేసే ఉద్యోగులకు ఐదేళ్ల మల్టీ ఎంట్రీ వీసాలను జారీ చేయడాన్ని ప్రారంభించింది. ఉద్యోగులు ఈ వీసాలను పొందడం ద్వారా ప్రయోజనం పొందొచ్చని తెలిపింది. ఈ సందర్భంగా దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ హమ్దాన్ బిన్ మహమ్మద్ మాట్లాడుతూ ఉద్యోగులు మల్టీ ఎంట్రీ వీసా తీసుకోవడం ద్వారా దుబాయ్‌కి సులభంగా ప్రయాణించొచ్చని తెలిపారు. దుబాయ్‌లో జరిగే కాన్ఫరెన్స్, ఎగ్జిబిషన్‌లు, మీటింగ్‌లకు ఉద్యోగులు హాజరుకావొచ్చని తెలిపారు. మల్లీ ఎంట్రీ వీసా పొందిన ఉద్యోగులకు విజిట్ చేసిన ప్రతిసారి 90రోజుల పాటు దుబాయ్‌లో ఉండేందుకు అవకాశం ఉంటుదని తెలిపారు. దీన్ని మరో 90 రోజుల వరకు పొడిగించుకోవచ్చు అని తెలిపింది. ఈ వీసా పొందేందుకు సుమారు 650 దిర్హమ్‌లను చెల్లించాల్సి ఉంటుందని అన్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/40ae94df-5916-473f-9c15-eadaf1b15c93-179x300.jpg)