ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మరోసారి తన సేవాతత్పరతను చాటుకుంది. అమెరికాలో ఇటీవల విమాన ప్రయాణం ఆలస్యం కావడంతో ఇబ్బంది పడ్డ భారతీయులకు తానా సభ్యులు అండగా నిలిచారు. వారికి అత్యవసర ప్రాతిపదికన భోజన ఏర్పాట్లు చేశారు. చికాగో నుంచి బయలుదేరాల్సిన ఎయిర్ ఇండియా విమానం సాంకేతిక సమస్యల కారణంగా నిలిచిపోయింది. దీంతో పలువురు భారతీయులు సమీపంలో హోటల్‌లో బస చేయాల్సి వచ్చింది. అయితే వారికి భోజనం ఏర్పాట్లు చేయడం కుదరదని ఎయిర్ ఇండియా రాత్రి 7:50 గంటలకు తెలిపింది. ఈ విషయం తెలుసుకునన తానా వెంటనే రంగంలోకి దిగింది. రవి సామినేని, హేమ కానూరు ఆధ్వర్యంలో తానా కేవలం రెండు గంటల్లో ఆహారాన్ని సిద్ధం చేసి హోటలోని ప్రయాణికులకు అందజేసింది.
