ఉక్రెయిన్ రష్యాపై చేస్తున్న ప్రతిదాడి విఫలం కావటంతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రాబోయే ఎన్నికల్లో ఓటమిపాలయ్యే అవకాశం ఉన్నట్టు ప్రముఖ జర్నలిస్టు సేమౌర్ హెర్ష్ అభిప్రాయపడ్డారు. డోనెట్స్క్, లుగాన్స్క్, ఖేర్సన్, జపోర్జియా ప్రాంతాలపైన రష్యా పట్టు ఏమాత్రం సడల లేదని పేర్కొన్నారు. రష్యాలో 24 గంటల పాటు జరిగిన తిరుబాటు ఉక్రెయిన్ ప్రతిదాడి వైఫల్యం నుంచి కాసేపు అందరి దృష్టిని మరల్చినా ఉక్రెయిన్ ఘోర పరాజయం పాలవటం ఖాయమనిపిస్తున్నది. ఉక్రెయిన్‌లో అమెరికా పోషిస్తున్న పాత్రను తన విదేశాంగ విధాన విజయంగా ప్రకటించుకుని 2024లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించాలన్న ఆశతోవున్న బైడెన్ రాజకీయ భవితను ఉక్రెయిన్ పరాజయం దెబ్బతీస్తుందని హెర్ష్ విశ్లేషించారు. ఇప్పటివరకు అమెరికా ఉక్రెయిన్‌కు 150బిలియన్ డాలర్ల విలువైన ఆయుధాలను అందించింది. ఉక్రెయిన్ ఓడిపోతే దాని ప్రభావం బైడెన్ భవితపైన తీవ్రంగా ఉంటుంది.