Namaste NRI

పుష్ప రిలీజ్ డేట్ వచ్చేసింది…

అల్లు అర్జున్‌, సుకుమార్‌ కాంబినేషన్‌ సినిమా పుష్ప విడుదల తేదీపై స్పష్టత వచ్చింది. ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా పుష్ప సినిమా షూటింగ్‌ ప్రస్తుతం వేగంగా జరుగుతుంది. రెండు భాగాలుగా రానున్న ఈ సినిమా పార్ట్‌ 1 పుష్ప `ద రైజ్‌ పేరుతో విడుదల చేస్తున్నారు. క్రిస్మస్‌ కానుకగా పుష్ప చిత్రాన్ని ఐదు భాషల్లో ఒకే రోజు విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు వెల్లడిరచారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో క్రిస్మస్‌ పండుగ సందర్భంగా పుష్ప`ద రైజ్‌ థియేటర్లలో విడుదల చేస్తున్నట్టు దర్శక నిర్మాతలు తెలిపారు.

                మరోవైపు ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్‌ కార్యక్రమాలు కూడా మొదలయ్యాయి. ఆగస్టు 13న ఐదు భాషల్లో పుష్ప తొలి సింగిల్‌ విడుదల కానుంది. దీనికి సంబంధించిన టీజర్‌ విడుదల చేశారు. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమాలో అల్లు అర్జున్‌కు జోడీగా రష్మిక మందన నటిస్తున్నారు. మిరోస్లా క్యూబా బ్రోజెక్‌ సినిమా టోగ్రఫీ అందిస్తున్నారు. రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌ నిర్మాతలు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress