విజయ్ శంకర్, అఘారెడ్డి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ఫోకస్. జి.సూర్యతేజ దర్శకుడు, వీరభద్రరావు పరిస నిర్మాత. మర్డర్ మిస్టరీ బ్యాక్ డ్రాప్‌లో ఆద్యంతం ఉత్కంఠమైన కథ కథనాలతో న్యూ ఏజ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కింది. తాజాగా ట్రైలర్‌ను హీరో శ్రీకాంత్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రైలర్ చాలా ఆసక్తికరంగా ఉంది. సూర్యతేజ మంచి సబ్జెక్ట్ ఎంచుకున్నారు. క్రైమ్ సస్పెన్ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నా అన్నారు. అనంతరం హీరో విజయ్ శంకర్ మాట్లాడుతూ ఈ సినిమా క్రైమ్ థ్రిల్లర్ అని తెలిపారు. చిత్ర నిర్మాత వీరభద్రరావు పరిస మాట్లాడుతూ ఈ నెల 28న థియిటర్స్‌లో సినిమా రిలీజ్ అవుతుంది అన్నారు. చిత్ర దర్శకుడు జి.సూర్యతేజ మాట్లాడుతూ ఫోకస్ అనేది ఒక కొత్త తరహా క్రైమ్ థిల్లర్. ఊహించని మలుపులతో సరికొత్త కథ, కథనాలతో ఈ సినిమా రూపొందింది అన్నారు. సుహాసిని, భానుచందర్ కీలక పాత్రధారులు. ఈ నెల 28న విడుదల కానుంది. ఈ కార్యక్రమంలో విజయ్ శంకర్, వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు.