
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) టంపా చాప్టర్ ఆధ్వర్యంలో ట్రినిటీ కేఫ్ నందు ఫుడ్ డ్రైవ్ ఏర్పాటుచేశారు. టిటిఎ ప్రెసిడెంట్ నవీన్ మల్లిపెద్ది నాయకత్వంలో బోర్డు డైరెక్టర్స్ దిలీప్ వాస , రఘు ఆలుగుబెల్లి, సుమారు 20 మంది వాలంటీర్స్ తో కలిసి ఫుడ్ డ్రైవ్ నిర్వహించారు.


దాదాపు 183 మందికి పైగా నిరాశ్రయులకు, అనాథలకు అల్పాహారాన్ని ఏర్పాటుచేశారు.ఎంతో ఆప్యాయంగా ఆదరించి అన్నదానం చేయడంతో వారు ఆనందాన్ని వ్యక్తం చేశారు.టిటిఏ టంఫా చాప్టర్ ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమాన్ని కమ్యూనిటీ సభ్యులు, స్థానికులు అభినందించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం అవడానికి సహకరించిన RVPs రాజేష్ యంసని, రాజేష్ రెడ్డి, ప్రవీణ్ గజ్జల మరియు క్రాంతి మేక మరియు RCs రూపేష్ యమ, ప్రణయ్ ముంగర, మోనికా కులకర్ణి, పృధ్వీ అలుగుబెల్లి , వాలంటీర్స్ తమ విలువైన సమయాన్ని కేటాయించి ఎంతో నబద్ధతతో పనిచేశారు.TTA టంపా టీమ్ ను పలువురు అభినందించారు.



