ఇండస్‌ఇండ్ బ్యాంక్ ఎన్నారైలా కోసం ఓ సూపర్ స్కీమ్‌ను అందిస్తుంది. ఇండస్‌ఇండ్ బ్యాంక్ మీరు మీ స్వదేశానికి తిరిగి రావడం సెలబ్రేట్ చేసుకునేలా ఎన్నారై హోమ్‌కమింగ్ ఫెస్టివల్ పేరిట ప్రత్యేక ప్రోగ్రామ్‌ను లాంచ్ చేసింది. ఐసీసీ మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ 2023, ఈ ఇయర్ ఎండింగ్ హాలీడే సీజన్, వచ్చే ఏడాది జనవరిలో ప్రవాసీ భారతీయ దివస్‌లను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రత్యేక స్కీమ్‌ను తీసుకువస్తున్నట్లు తన ప్రకటనలో పేర్కొంది. ఈ ప్రత్యేక ప్రోగ్రామ్ ద్వారా ఇండియాలో మీ బసను మరింత ఆనందదాయకంగా మార్చడంతో పాటు బోలెడు ప్రయోజనాలు కలిగేలా బ్యాంక్ వారు ప్లాన్ చేశారు.
సేవింగ్స్ ఖాతాలపై వార్షిక వడ్డీ రేటు అనేది ఏకంగా 6.75 శాతం వరకు పొందవచ్చు. ప్రస్తుతం మార్కెట్‌లో ఎన్నారైలకు ఉన్న అత్యధిక ధరల్లో ఇది ఒకటి. అలాగే డిపాజిట్లపై వార్షిక వడ్డీ రేటు 7.5 శాతం వరకు పొందవచ్చు. ఇండియాలో ఉన్నప్పుడు సేవింగ్స్‌ను పెంచుకోవడానికి ఇది ఒక గొప్ప మార్గం అనడంలో ఎలాంటి సందేహం లేదు. యూఎస్‌డీ ఎఫ్‌సీఎన్ఆర్ డిపాజిట్లపై వార్షిక వడ్డీ రేటును 5.95 శాతం వరకు పొందవచ్చు. విదేశీ కరెన్సీలో తమ నిధులను ఉంచాలనుకునే ఎన్నారైలకు ఇది ది బెస్ట్ చాయిస్ కూడా. అయితే, ఈ ఆఫర్లు పరిమిత కాలానికి మాత్రమే చెల్లుబాటు అవుతాయి. అందుకే వీలైనంత త్వరగా ఇండస్‌ఇండ్ బ్యాంక్‌లో మీ అకౌంట్ ఓపెన్ చేసుకోవడం బెటర్. ఇవే కాకుండా ఎన్నారైల కోసం ఇండస్‌ఇండ్ బ్యాంక్ కొన్ని బంపర్ పండుగ ఈవెంట్‌లను కూడా ప్లాన్ చేసింది. ఇండస్‌ఇండ్ బ్యాంక్‌కు చెందిన దేశవ్యాప్తంగా ఉన్న 198 ఎన్నారై కేంద్రీకృత శాఖలలో దేనినైనా సందర్శించి క్విజ్‌లు, గేమ్స్‌లో పాల్గొనడం ద్వారా అద్భుతమైన బహుమతులు, వోచర్‌లను గెలుచుకునే అవకాశం కల్పించింది.














