నాగలక్ష్మి ప్రొడక్షన్స్ పతాకంపై రవీంద్ర గోపాల హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన సినిమా దేశం కోసం భగత్‌సింగ్. రాఘవ, మనోహర్, జీవా, సూర్య, సుధ, ప్రసాద్ బాబు ఇతర పాత్రలు పోషించారు. తాజాగా చిత్ర ప్రచార కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రైలర్ చాలా బావుంది. సబ్‌టైటిల్స్ కూడా చాలా బాగా లీడ్ చేశారు అన్నారు. ఈ టైటిల్ దాసరినారాయణరావు కోసం నేను రిజిస్టర్ చేయించిన టైటిల్. కానీ మన రవీంద్రగారు నాకు ఫోన్ చేసి అడిగారు. ఈ చిత్రం బయటకు రావడం కోసం ఎంత ఇబ్బంది పడ్డారో నాకు బాగా తెలుసు. 14క్యారెక్టర్లు ఒక పర్సన్ చెయ్యడం అంటే ఆ టెన్షన్ మాములుగా ఉండదు. దేశం మీద ప్రేమ మీకు ఉంటే ఈ చిత్రం తప్పకుండా చూడండి. ఈ మూవీ విజయం సాధించాలని కోరుకుంటున్నాను అన్నారు. రవీంద్ర గోపాల మాట్లాడుతూ సామాజిక స్పృహతో నేనీ చిత్రాన్ని రూపొందించాను. 1947 నేపథ్యంగా సాగే ఈ చిత్రంలో 14 మంది స్వాతంత్య్ర సమరయోధుల పాత్రలను పోషించాను. ఈ చిత్రంతో మా అబ్బాయిని ఆజాద్ చంద్రశేఖర్‌గా పరిచయం చేస్తున్నాను. దేశం కోసం పోరాడిన ఎంతోమంది యోధుల్లో భగత్‌సింగ్ ప్రధానంగా ఎంచుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ప్రేక్షకులకు స్ఫూర్తినిచ్చే విధంగా ఉంటుంది అన్నారు. ఈ నెల 10న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్నది.