విదేశాల్లో తొలిసారిగా లండన్లో అలయ్ బలయ్ కార్యక్రమం నిర్వహించారు. దసరా వేడుకల సందర్భంగా ఈ నెల 13న ఆదివారం సిక్క చంద్రశేఖర్ ఆధ్వర్యంలో జరగ్గా, ప్రవాస భారతీయులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వివిధ దేశాల్లో కుల, మతాలపరంగా విడిపోయిన తెలుగువారందరినీ ఏకతాటిపైకి తెచ్చే ఉద్దేశంతో ఈ ఉత్సవాలు ఏర్పాటు చేశామని చంద్రశేఖర్ తెలిపారు. ఇక్కడికి తరలివచ్చిన వివిధ రంగాలకు చెందిన తెలుగు వారు పరస్పరం ఆలింగనం చేసుకుంటూ ఆప్యాయంగా పలుకరించుకున్నారు. తెలంగాణ వంటకాల రుచులను ఆస్వాదించారు.