Skip to main content

Namaste NRI

అమెరికా చరిత్రలోనే తొలిసారిగా..ఒక్కో అమెరికన్‌పై

అమెరికా అప్పుల ఊబిలో కూరుకుపోయింది. గత డిసెంబర్‌ 29 నాటికి దేశ రుణాలు 34 ట్రిలియన్‌ డాలర్లకు (రూ. 2,832 లక్షల కోట్లు) చేరాయి. ఈ లెక్కన ఒక్కో అమెరికన్‌ నెత్తిపై లక్ష డాలర్లు (రూ. 83 లక్షలు) అప్పు ఉన్నట్టు తేలింది. ఈ మేరకు అమెరికా ట్రెజరీ డిపార్ట్‌మెంట్‌ తాజా నివేదికలో వెల్లడించిం ది. బడ్జెట్‌ లోటు కూడా గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగిపోయినట్టు వివరించింది. నిజానికి అమెరికా అప్పులు 2029 సంవత్సరానికి ఈ స్థాయికి చేరుకొంటాయని అంచనా వేశారు. అయితే 2019-20లో కరోనా సృష్టించిన సంక్షోభం, అనంతరం విధించిన లాక్‌డౌన్‌ కారణంగా వర్తక, వాణిజ్య సముదాయాలు మూతబడి ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. కొవిడ్‌ కల్లోలం ముగియగానే ముసురుకొన్న ఆర్థిక మాంద్యం భయాలు, ద్రవ్యోల్బణ పరిస్థితులు, వెరసి అమెరికాను అప్పుల కుప్పగా మార్చాయి.

Social Share Spread Message

Latest News