అమెరికా చరిత్రలో తొలిసారిగా స్పీకర్‌పై వేటుపడింది. ప్రతినిధుల సభ స్పీకర్ కెవిన్ మెక్‌కార్తీపై రిపబ్లికన్ పార్టీ నేత మ్యాట్ గేజ్ అవిశ్వాస తీర్మానం తీసుకువచ్చారు. దీనిపై ఓటింగ్ జరిపి మెక్‌కార్తీని పదవి నుంచి తీసివేశారు. ఇప్పుడు దేశ ఎగువ సభ సెనెట్ అధికార డెమోక్రాటిక్ పార్టీ ఆధిక్యతతో పవర్ దక్కించుకుంది. అయితే ప్రజా ప్రతినిధుల సభలో ప్రతిపక్షమైన రిపబ్లికన్లకు తొమ్మిది సీట్లు ఎక్కువ వచ్చాయి. 55వ స్పీకర్ అయిన మెకార్థీ పై ఇప్పుడు తీసుకువచ్చిన అవిశ్వాస తీర్మానం 216/220 ఓట్ల తేడాతో నెగ్గింది. దీనితో పదవి నుంచి వైదొలిగిన తొలి స్పీకర్‌గా మెకార్ఠీ నిలిచారు.
రుణాల చెల్లింపులు, షట్‌డౌన్ వ్యవహారాలతో చివరికి ఈ రిపబ్లికన్ నేత సొంత పార్టీ అవిశ్వాసంతోనే పదవీ కోల్పోవల్సి వచ్చింది. సభలో అధికార పక్షానికి తోడ్పడుతున్నారని ఆయన సొంతపార్టీకి చెందిన కొందరి నుంచి వ్యతిరేకతలను పొందాల్సి వచ్చింది. సభలో రిపబ్లికన్ పార్టీలో విభేదాలు తీవ్రతరం అయ్యాయి. దీని వల్ల అమెరికా షట్‌డౌన్ పరిస్థితి వంటి పరిణామాలు నుంచి అధికార పార్టీ గట్టెక్కింది. తాను తిరిగి స్పీకర్ పదవి కోసం పోటీపడేది లేదని, తనకు సంబంధించి తాను సముచితంగానే వ్యవహరించినట్లు భావిస్తున్నానని , నమ్మిన విషయం కోసం ముందుకు సాగానని పదవీచ్యుత స్పీకర్ తెలిపారు.