Namaste NRI

ఐదేళ్లలో తొలిసారిగా.. ఆ దేశాలకు భారీగా తగ్గిన భారత విద్యార్థులు

గడిచిన ఐదేళ్లలో తొలిసారిగా విదేశాలకు వెళ్లే భారతీయ విద్యార్థుల  సంఖ్య భారీగా తగ్గింది. ఇండియన్‌ స్టూడెంట్స్‌ ప్రధానంగా వెళ్లే కెనడా, అమెరికా , యూకే  ల్లో వీసా తిరస్కరణలు కూడా అందుకు కారణం కావచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. గత ఏడాది కెనడా, అమెరికా, యూకేల నుంచి భారతీయ విద్యార్థులకు లభించే స్టూడెంట్‌ వీసాల్లో 25 శాతం తగ్గుదల కనిపించింది.

కెనడాకు వెళ్లేవారి సంఖ్యలో 32 శాతం తగ్గుదల నమోదైంది. ఇది 2.78 లక్షల నుంచి 1.89 లక్షలకు తగ్గింది. ఈ విషయాన్ని కెనడాకు చెందిన ఇమ్మిగ్రేషన్‌, రెఫ్యూజీస్‌ అండ్‌ సిటిజన్‌షిప్‌ సంస్థ వెల్లడించింది. అమెరికాకు వెళ్లే వారి సంఖ్య 34 శాతం పడిపోయింది. క్రితం ఏడాదితో పోలిస్తే ఎఫ్-‌1 వీసాల్లో 1,31,000 నుంచి 86,000కు తగ్గుదల నమోదైంది. యూకేకు వెళ్లే వారి సంఖ్యలో 26 శాతం తగ్గుదల కనిపించింది. గతంలో 1,20,000లుగా ఉన్న విద్యార్థి వీసాలు,  తర్వాత 88,732కు తగ్గాయి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events