ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాపిస్తుంది. ఫ్రాన్స్ దేశంలో ఒక్కరోజులోనే తొలిసారిగా లక్ష కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మహమ్మారి వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుంచి ఆ దేశంలో అధిక సంఖ్యలో ఒక్కసారిగా కేసులు పెరిగాయి. ఆసుపత్రుల్లో చేరికలు కూడా రెట్టింపయ్యాయి. గడిచిన వారంలో ప్రతి వంద మందిలో ఒకరికి కోవిడ్ పాజిటివ్ బయటపడుతోంది. అంతేకాకుండా కొత్తగా నమోదవుతున్న కేసుల్లో అధిక ఇన్ఫెక్షలు ఒమిక్రాన్‌తో సంబంధం కలిగి ఉంటున్నాయి. రానున్న రోజుల్లో ఒమిక్రాన్ మరింత డామినెట్ చేసే అవకాశం ఉన్నట్లు ఫ్రాన్స్ ప్రభుత్వ నిపుణులు అంచనా వేస్తున్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/protests-300x160.jpg)