వందల సంవత్సరాల నుంచి జనవరి 7న క్రిస్మస్ జరుపుకొంటున్న ఉక్రెయిన్ తొలిసారి ఇప్పుడు ఆ తేదీని డిసెంబరు 25కు మార్చింది. ప్రభుత్వ సెలవు దినాన్ని ఈ మేరకు మారుస్తూ ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీ జులైలోనే ఉత్తర్వులు జారీ చేశారు. రష్యన్ ఆర్థోడాక్స్ చర్చి నిబంధనలు అనుసరించే ఉక్రెనియన్లు 2018లో ఆ చర్చి నుంచి విడిపోయారు. 2022లో రష్యా దండయాత్ర తరవాత రష్యన్ చర్చితో పూర్తిగా తెగతెంపులు చేసుకున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ తొలిసారి అధికారికంగా 25న క్రిస్మస్ జరుపుకుంది.