జమ్ముకశ్మీర్ ఓ ప్రతిష్ఠాత్మక సదస్సుకు వేదిక కానుంది. ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక శక్తులు, అతివేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు గల దేశాల అధినేతలు కలిగిన జీ20 కూటమి శిఖరాగ్ర సమావేశానికి జమ్ము కశ్మీర్ ఆతిథ్యమివ్వనుంది. భారత్ దేశంలో తొలిసారిగా జీ 20 సదస్సు 2023లో జరుగనుంది. ఈ సమావేశాలను జమ్ముకశ్మీర్‌లో నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. జీ 20 సభ్యదేశాల్లో ఒకటి ప్రతి ఏటా డిసెంబర్‌లో సదస్సుకు అధ్యక్షత వహిస్తుంది. ఈ క్రమంలో భారత్‌కు జీ 20 అధ్యక్షత బాధ్యతలు ఈ ఏడాది డిసెంబర్ 1న లభిస్తాయి. ఇందులో భాగంగా 2023 నవంబర్ 30 వరకు కూటమికి సమావేశాలకు సంబంధించిన వ్యవహరాలను భారత్ నిర్వర్తిస్తుంది. వచ్చే ఏడాది నవంబర్ 30 నుంచి డిసెంబర్ 1 వరకు జరిగే 18వ జీ`20 శిఖరాగ్ర సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది.