ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా రెండు హ్యూమనాయిడ్(మనుషులను పోలినవి) రోబోల మధ్య బాక్సింగ్ పోటీ జరగబోతున్నది. వచ్చే నెలలో జరగనున్న ఈ బాక్సింగ్ పోటీకి సంబంధించి ప్రత్యక్ష ప్రసారాన్ని చేపడుతున్నట్టు చైనా రోబోటిక్ సంస్థ యునిట్రీ తాజాగా వెల్లడించింది. ఈ పోటీకి సంబంధించి ఒక ప్రమోషనల్ వీడియోను కూడా సంస్థ విడుదల చేసింది.

4.3 అడుగుల ఎత్తున్న జీ1 హ్యూమనాయిడ్, 5.11 అడుగుల ఎత్తున్న హెచ్-1 మోడల్ రోబోల మధ్య ఈ బాక్సింగ్ పోటీ నిర్వహిస్తున్నట్టు తెలిసింది. హెచ్1 మోడల్, యూనిట్రీ ప్రధాన రోబో. అత్యుత్తమ కంప్యూటింగ్ శక్తి, అత్యంత చురుకైన చలన నియంత్రణ దీని సొంతం. ఈ ఏడాది జనవరిలో యూనిట్రీ తన రోబోల అద్భుతమైన నృత్య నైపుణ్యాలను ప్రదర్శించింది. తాజాగా రోబోల బాక్సింగ్ పోటీలకు సిద్ధమైంది.
