Skip to main content

Namaste NRI

ప్రపంచంలోనే తొలిసారిగా…అమెరికాలో  

భూమిపైనే కాకుండా భూమి వెలుపల ఎదురయ్యే ముప్పులను సమర్థంగా ఎదుర్కొనేందుకు అమెరికా సిద్ధమ వుతున్న ది. ఇందులో భాగంగా ప్రపంచంలోనే తొలిసారిగా ఆ దేశ వింగ్‌ స్పేస్‌ ఫోర్స్‌ (యూఎస్‌ఎస్‌ఎఫ్‌) భూ కక్ష్యలో సైనిక విన్యాసాలను నిర్వహించనున్నది. ఈ మేరకు అమెరికా స్పేస్‌ ఫోర్స్‌ ఇటీవల రాకెట్‌ ల్యాబ్‌ నేషనల్‌ సెక్యూరిటీ, ట్రూ అనోమలీ అనే ప్రైవేటు అంతరిక్ష కంపెనీలతో ఒప్పందం చేసుకొన్నదని స్పేస్‌ సిస్టమ్స్‌ కమాండ్‌ పేర్కొన్నది. విక్టస్‌ హేజ్‌ అని పేరు పెట్టిన ఈ మిషన్‌ 2025లోగా అమలు చేసే అవకాశం ఉన్నదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ రెండు కంపెనీలు స్పేస్‌ ఫోర్స్‌కు అవసరమైన ఆర్పీవో, అంతరిక్ష నౌకలు వంటివి అందించనున్నాయి. ట్రూ అనోమలీకి చెందిన స్పేస్‌ వెహికల్‌ జాకల్‌,రాకెట్‌ ల్యాబ్‌కు చెందిన మానవరహిత వాహనం కక్ష్యలో సంభవించే ప్రతికూల పరిస్థితులకు స్పందించే యూఎస్‌ స్పేస్‌ ఫోర్స్‌ సామర్థ్యాన్ని ప్రదర్శిస్తాయి.

Social Share Spread Message

Latest News