ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ నియంతృత్వ పోకడలు ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేస్తుంటాయి. ఉత్తర కొరియా మాజీ అధినేత కిమ్ జోంగ్ ఇల్ పదో వర్థంతి సందర్భంగా 11 రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన విధించిన ఆంక్షలు నివ్వెరపరుస్తున్నాయి. ఈ 11 రోజులు పాటు ఆ దేశంలోని ప్రజలెవ్వరూ నవ్వకూడదట. అదే విధంగా షాపింగ్ చేయడం, మద్యం తాగడం వంటి వాటిపై కిమ్ జోంగ్ ఉన్ ప్రభుత్వం నిషేధం విధించింది. ఎవరైనా ఆంక్షలు ఉల్లంఘిస్తే ప్రతి ఏడాది మదిరిగానే అరెస్టులు చేస్తామని హ్చెరించింది. ఆఖరుకు కుటుంబసభ్యుడెవరైనా మరణించినా పెద్దగా ఏడ్చేందుకు అనుమతి లేదు. పుట్టిన రోజుల వేడుకులపై నిషేధం అని ప్రభుత్వం ఆదేశాల్లో పేర్కొన్నది.
కిమ్ జోంగ్ ఇల్ 1994 నుంచి 2011 వరకు జిమ్ జోంగ్ ఇల్ ఉత్తర కొరియా అధినేతగా ఉన్నారు. తన నియంతృత్వ వైఖరితో ప్రజలకు స్వేచ్ఛను దూరం చేశారు. 2011, డిసెంబర్ 17న గుండెపోటుతో మరణించారు. కిమ్ కుటుంబ పాలనలోని ఉత్తర కొరియా ప్రజలకు ఆంక్షలు కొత్తేం కాదు. దేశంలో కరువు తాండవిస్తుండటంతో సరిగ్గా తిండితినే పరిస్థితి లేదు. ఆహార కొరత నెలకొనడంతో కొద్ది నెలల క్రితం కిమ్ చేసిన ప్రకటనపై ప్రపంచం ముక్కున వేలేసుకుంది.